Sunday, January 5, 2025

మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు రంగంలోకి బృందాలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఖమ్మంలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి నీ రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సిఎం కెసిఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఆదేశించారు.మున్నేరు వరద ఉధృతి , సహాయ చర్యల పై మంత్రి పువ్వాడని  సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు.

సిఎం కెసిఆర్ ఆదేశాలతో భద్రాచలం నుంచి ఖమ్మం  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బయలు దేరారు. మరి కాసేపట్లో మున్నేరు ప్రవాహంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తామని పువ్వాడ తెలిపారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పాత బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.బైపాస్ లో కిలోమీటర్ల మేర  వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News