Monday, December 23, 2024

ముందస్తుకు మేం రె’ఢీ’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ ప్రభుత్వానికి ముందస్తూ ఎన్నికలకు వచ్చే ధైర్యం ఉందా? కెసిఆర్ ప్రశ్నించారు. నిజంగా ఆ పార్టీకి దమ్ముంటే…ఎప్పుడు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తాను కూడా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదామని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై సిఎం కెసిఆర్ వివరణ ఇచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్ధేశ్యం తమకు ఎంతమాత్రం లేదన్నారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళితే మాత్రం తప్పకుండా తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని స్పష్టం చేశారు.

మాతో గోక్కుంటే….అగ్గితో గోక్కున్నట్లే
మాతో (టిఆర్‌ఎస్)తో గోక్కుంటే….అగ్గితో గోక్కున్నట్లేనని కెసిఆర్ హెచ్చరించారు. మోడీ గోకకున్నా తాను మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించారు.75 ఏళ్ల దేశ రాజకీయంలో బ్లేమ్ గేమ్ నడుస్తోందన్నారు. అవసరం అయిన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. సింగపూర్, చైనా రాజనీతి దేశంలో కూడా రావాలన్నారు. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. అనవసరంగా తెలంగాణ వంటి పరిగెత్తే రాష్ట్రాల అభివృద్ధిలో కట్టెలు పెడుతోందని మండిపడ్డారు. దేశంలో ఏ మూల అభివృద్ధి చెందినా దేశంలోకి వస్తుంది కదా? అని ప్రశ్నించారు.

దేశంలో కొత్త పార్టీ రావొద్దా?
దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని కెసిఆర్ ప్రశ్నించారు. దేశంలో కేవలం బిజెపి, కాంగ్రెస్ పార్టీలే ఉండాలా? అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ జాతీయ పార్టీ కాకుడదా? అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెసిఆర్ చెప్పారు. అవసరమైతే జాతీయ పార్టీగా మారిస్తే తప్పంటీ అని ప్రశ్నించారు. త్వరలోనే జాతీయ స్థాయిలో తమ ఎజెండా ఏమిటన్నది స్పష్టంగా చెబుతామన్నారు. దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదు …. తెలంగాణ మోడల్ అని అన్నారు. అభివృద్ధి పేరుతో అన్ని దొంగ ఫోటోలు చూపించి మోడీ దేశానికి ప్రధాని అయ్యారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మారిస్తామన్నారు. అలాగే ఎల్‌ఐసిని కాపాడుకుంటామన్నారు.

కెసిఆర్ ఒక ఫైటర్
కెసిఆర్ ఒక ఫైటర్ అని….ఎవరికి భయపడరని అన్నారు. తనకు మనీ లేదు, లాండరింగ్ లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా పోతే ఏమైతది….మా అంటే ఒకటో…రెండో కేసులు పెడతారన్నారు. వాళ్ళు కేసులు వేస్తే న్యాయ అందించే న్యాయ స్థానాలు లేవా? అని కెసిఆర్ అన్నారు. కేసులపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామన్నారు.

యంగ్ ప్రధాని ఉంటేనే….దేశానికి జోష్
సైన్యంలో జోష్ కావాలంటున్న బిజెపి…..మరీ దేశానికి ముసలి మోడీ అవసరమా? అని ప్రశ్నించారు. యంగ్ ప్రధాని ఉంటే దేశం ఇంకా జోష్ తో ముందుకు వెళ్తది కదా? అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. మోడీ మంత్రివర్గంలో 60శాతం మినిస్టర్లు ముసలోల్లే ఉన్నారన్నారు. దేశానికి పక్కనున్న పాకిస్థాన్‌తో ఎటువంటి సమస్య లేదని…ఉన్నదంతా చైనాతోనని ఒక ప్రశ్నకు సమాధానంగా కెసిఆర్ తెలిపారు.

దేశం డేంజర్ పరిస్థితిలో ఉంది
మోడీ పాలనలో దేశం డేంజర్ పరిస్థితిలో ఉందని సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల ప్రయోజనాల కోసం దేశాన్నే తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే ప్రజలపై అభిమానం చూపిస్టున్న నటిస్తూ…కార్పొరేట్ సంస్థ సేవలో తరిస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. మోడీ పాలనలో చెప్పలేనంత అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సాక్షాత్తూ మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో కాశీ ఘాట్‌ను నట్లు, బొట్లతో కడితే ఒక్క వర్షానికే కూలిపోయిందన్నారు. ఎన్నికల కోసం కాశీలో గుడి నిర్మాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇక కాశ్మీరీ పడిత్ సినిమా తీశారు..వాళ్ళను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.మోడీ అసమర్థమైన విధానాల వల్ల పెట్టుబడులన్ని వెనక్కి వెలుతున్నాయన్నారు. రాజకీయాల నాయకులపై అవినీతి కేసులు అంటారు…బిజెపి కండువా కప్పుకోగానే అన్ని నోటీసులు, కేసులు పక్కకు పోతున్నాయన్నారు. బ్యాంక్ లూటీలు మోడీకి తెలియకుండా జరగడం లేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే బయటపెడుతామన్నారు. బ్యాంక్‌కు లూటీపై ట్యాపింగ్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఈ లూటీలో మోడీకి ఇవ్వాల్సినదంతా ఇచ్చారు అని తెలుస్తోందన్నారు. 12లక్షల కోట్లు ఎన్‌పిఎ ఎందుకు ఇవ్వాలి?. వాళ్ళు దేశానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. పార్టీలను చీల్చడం, కోట్లు పెట్టి నాయకులను కొనడం ఇదేనా రాజకీయని నిలదీశారు. దేశంలో వంద ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, అటువంటప్పుడు 4వేలకు టన్ను దొరికితే 30వేలు పెట్టి ఎందుకు కొనాలని నిలదీశారు. మోడీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని….కేవలం ఆయన విధానాలకు మాత్రమే వ్యతిరేకమని కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు.

CM KCR Challenge to BJP on Early Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News