Wednesday, January 22, 2025

ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం కెసిఆర్ భేటీ… కొన్ని చోట్ల మార్చులు చేర్పులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందన్నారు. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చామని ఆయన పేర్కొన్నారు. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగియని చెప్పారు.

ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమే అన్నారు. ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపికచ సంయమనం అవసరమన్నారు. అభ్యర్థులు… అందరు నాయకులను కలుపుకుని పోవాలని సిఎం సూచించారు. మన నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారు. మనవాల్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పెడతారని పేర్కొన్నారు. మనమా వంటి నాయకుల విషయంలో అలా జరిగిందన్నారు. సందేహాలు ఉంటే మన న్యాయ బృందాన్ని సంప్రదించడని కెసిఆర్ వెల్లడించారు. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News