ఆకుపచ్చ తెలంగాణ కోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి ప్రతి నెలా విరాళం
ఐఎఎస్, ఐపిఎస్‌ల జీతాల నుంచి నెల నెల రూ.100 ఎంఎల్‌ఎలు, ఎంపిలు రూ.500 ఆస్తుల రిజిస్ట్రేషన్ల నుంచి రూ.50 ఇంకా బార్లు తదితరాల నుంచి వివిధ స్థాయిల్లో విద్యార్థుల ఫీజుల నుంచి కూడా తప్పనిసరి విరాళాల సేకరణకు నిర్ణయం శాసనసభలో సిఎం ప్రతిపాదనకు హర్షం ప్రకటించిన ప్రతిపక్షం
ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాల నుంచి ప్రతినెల సాయం
ఐఏఎస్, ఎపిఎస్‌లనుంచి రూ.100, అటెండర్‌నుంచి రూ.25, ఎంఎల్‌ఎలు, ఎంపిల నుంచి రూ.500
ప్రవేశాల సందర్భంలో విద్యార్థుల నుంచి వసూళ్లు
పాఠశాల విద్యార్ధికి రూ.5, ఇంజనీరింగ్ విద్యార్ధికి రూ.100
భూవిక్రయాల్లో రిజిస్ట్రేషన్‌కు రూ.50
బార్లు, ఫెర్టిలైజర్స్, లైసెన్స్ రెన్యూవల్ టైంలో రూ.1000
కెసిఆర్‌కు ప్రజాప్రతినిధులు,అధికారుల ధన్యవాదాలు
తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా సాగేందుకు హరిత నిధిని ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును అసెంబ్లీలో కలిసి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపా రు. వారిలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంఎల్‌ఎ గువ్వుల బాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సిఎం సెక్రటరి భూపా ల్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవీ శాఖ) శాంతికుమారి, పిసిసిఎఫ్ ఆర్. శోభ, సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్ తదితరులు ఉన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ హితమే లక్షంగా రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చే ప్రక్రియ నిరంతరంగా కొనసాగేందుకు కెసిఆర్ సర్కారు వినూత్న ప్రణాళికను రూపొందించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమానికి భివిష్యత్తులో నిధుల కొరత అడ్డంకి కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ హరిత నిధిని ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో హరితహారంపై జరిగిన లఘుచర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఎం హరి త నిధిని ప్రకటించారు. ఐఏఎస్ ఆధికారి నుంచి అటెండర్ దాక , ఎమ్మెల్సీ నుంచి ఎంపిల దాక, విద్యార్ధులనుంచి రైతుల దాకా ప్రజల భాగస్వామ్యాన్ని హరితహా రం కార్యక్రమంలో మరింతగా పెంచుతూ హరితనిధిని ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం సభలో ప్రకటించగా అన్ని రాజకీయ పక్షాల సభ్యులు హరితనిధి పథకం ప్రతిపాదనను ఏకగ్రీవంగా స్వాగతించారు.
హరితనిధి పథకం అమలును సిఎం కెసిర్ సభకు వివరిస్తూ ప్రతి ఐఏఎస్ అధికారి తన జీతం నుంచి ప్రతినెల రూ.100 హరిత నిధికి అందచేసేందు ఐఏఎస్ అధికారల సంఘం మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపిందన్నారు. అదే విధం గా ఐపిఎస్ అధికారుల సంఘం ,ఐఎఫ్‌ఎస్ అధికారుల సం ఘం కూడా ప్రతినెల హరితనిధికి రూ.100 అందచేసేందుకు అంగీకారం తెలిపిందన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతాలనుంచి ప్రతినెల రూ.50 హరితనిధికి అందచేసేందుకు అంగీకరించారన్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం ,ఎన్జీఓల సఘం , ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అంగీకారం తెలిపినట్టు సిఎం సభకులో వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రానికి చెదిన లోక్‌సభ సభ్యులు , రాజ్యసభ సభ్యులు కూడా తమ వేతనాలనుంచి ప్రతినెల రూ.500 ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిపారు.
రాష్ట్రంలోని విద్యార్దుల్లో కూడా హరితహారం స్ఫూర్తిని నింపేందుకు వారినుంచి కూడా హరితనిధికి కాంట్రిబ్యూషన్ చేయిస్తామన్నారు. పాఠశాల స్థాయిలో రూ.5, హైస్కూల్ స్థాయిలో రూ.10, కాలేజి స్థాయిలో రూ.25 , డిగ్రీస్థాయిలో రూ.50, ఇంజనీరింగ్ మెడికల్ తదితర వృత్తి విద్యాసంస్థల స్థాయిలో రూ.100 విద్యార్దుల అడ్మిషన్ల సందర్బాల్లోనే ప్రతి విద్యార్ధి నుంచి హరితనిధినికి వసూలు చేసేలా ప్రతిపాదించినట్టు వెల్లడించారు. అంతే కాకుం డా భూములు ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాల సందర్బంగా ప్రతి రిజిస్ట్రేషన్ ద్వార రూ.50 హరితనిధికి అందించేలా ప్రతిపాదించామని వివరించారు. రాష్ట్రంలో ప్రతిరోజు 8వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరగుతుంటాయన్నారు. ఎన్‌ఏసి(నాక్ ) సంస్థ ద్వారా కాంట్రాక్టు సంస్థల నుంచి ఏటా 0.1శాతం కింద రూ.25కోట్లు వసూలు అవుతున్నాయని , ఇదేరీతిలో హరితనిధికోసం మరో 0.1శాతం వసూలు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. హరితనిధి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తామని సిఎం కెసిఆర్ సభలో ప్రకటించారు. బార్లు, మద్యం షాపులు , ఎరువుల షాపులు తదితర సంస్థలు ఏటా తమ లైసెన్స్‌ను రెన్యూవల్ చేస్తుంటాయని వీటి నుంచి కూడా లైసెన్స్ రెన్యూవల్ సందర్భంగానే హరితనిధి కింద ప్రత్యేకంగా రూ.1000 వసూలు చేయనున్నట్టు సిఎం వివరించారు.
230కోట్ల మొక్కల పెంపకం లక్ష్యం: సిఎం
హరితహారం కార్యక్రమం లక్ష్యాలను సిఎం సభకు వివరిస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా బిల్లు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. 2015లోనే నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని, సామాజిక అడవులతో అనేక ప్రయోజనాలు ఉంటాయని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం భూభాగం 2 కోట్ల 75లక్షల ఎకరాలు ఉండగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం 66 లక్షలకుపైగా అటవీ భూములు ఉన్నాయ ని సిఎం స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన అడవులు ఉన్నాయన్నారు. 230కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పంతో కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. గతంలో పార్కు అంటే గ్రామాల్లో తెలిసేది కాదని,13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెరుగుతున్నాయన్నారు. 53 అర్బన్ పార్కుల్లో పనులు బాగా జరిగాయని సిఎం వివరించారు. మిగతా ప్రాంతాల్లో భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో చెట్లు నరికితే రూ.4 లక్షల జరిమానా విధించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదించిన హరితనిధి పథకానికి కాంగ్రెస్ పార్టీ సభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం పార్టీ నేత అక్భరుద్దీన్ ఒవైసి, బిజెపి నేత రాజాసింగ్ తదితరులు స్వాగతించారు. ఈ కార్యక్రమానికి తాము కూడా సహకరిస్తామని వెల్లడించారు.