Saturday, November 2, 2024

వడ్లు కొనేదాకా బిజెపిని వదిలిపెట్టం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR comments on BJP

హైదరాబాద్: తెలంగాణ బిల్లు పాసయ్యే సమయంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌కు పార్లమెంట్ ఎలా ఉంటదో తెలుసా? అని సిఎం కెసిఆర్ చురకలంటించారు. బిజెపోళ్లకు సిఎం కెసిఆర్ రీకౌంటర్ ఇచ్చారు. బిజెపి వాళ్లు దేశంలో ఏ వర్గం ప్రజలకు మేలు చేశారో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకో 70 నుంచి 80 వేల మంది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించామని కేంద్రాన్ని అడిగితే సతాయించారని, బిజెపోళ్లు లాగా గోల్‌మాల్ తిప్పడం తమకు రాదని దుయ్యబట్టారు

రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ప్రభుత్వం చెప్పిందని, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత బిజెపికే దక్కుతుందని విమర్శించారు. నిరుద్యోగం తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణకు సిఎం కెసిఆర్ ఏమీ చేయలేదు అనే మాట జోక్ ఆఫ్ ది మిలీనియం అని వ్యంగస్త్రాలు సంధించారు. ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు తాము రాజీనామాలు చేసి గెలిచామన్నారు. ఉద్యమ సమయంలో కొందరు దద్దమ్మలు రాజీనామా చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు.

భారత దేశం మొత్తంలో కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లను కూడా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని ప్రశంసించారు. కూలీలను వాళ్ల ఖర్మానికి వదిలేస్తే తాము వాళ్ల కోసం 160 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతో కిరాయిలను తామే భరించామని గుర్తు చేశారు. ప్రెటోల్ సెస్ ఉపసంహరణ మీద బిజెపి వైఖరేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచిందని బిజెపోళ్లు అబద్ధాలు చెబుతున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిఎస్‌టిలో రాష్ట్రాల వాటా ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. దేశం దురాక్రమణకు గురికాకుండా చూడండని చెబితే దేశద్రోహాం కేసు పెడుతారా? అని మండిపడ్డారు. కెసిఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నాడని అంటున్నారని, తలాతోక లేకుండా మాట్లాడి అబద్దాలతో బతికే పార్టీ బిజెపి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అడుగుతున్న కేంద్రాన్ని ధాన్యం కొంటరా? లేదా చెప్పండని నిలదీశారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? లేదా సీదా చెప్పండని అడిగారు. వడ్లపై సమాధానం చెప్పేదాకా బిజెపిని, కేంద్రాన్ని వదిలిపెట్టమని కెసిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News