Thursday, January 23, 2025

కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు. బిజెపి పాలనలో తాగునీటికి, సాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటున్నామని అన్నారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకని నిలదీశారు. దేశమంతటా ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతోనే బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు.

దేశ రైతాంగం బాగుపడే వరకు బిఆర్‌ఎస్ పోరాటం ఆగదని చెప్పారు. దేశంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నా వాడుకోలేక వృథా చేస్తున్నామని సిఎం తెలిపారు. దేశంలో ఏటా 1.40 లక్షల టిఎంసిల వర్షం పడుతుంటే మనం కేవలం 20 వేల టిఎంసిల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నామని అన్నారు.50వేల టిఎంసీల నీరు సముద్రం పాలు చేసుకుంటున్నాము. ఇది తాను కానీ, బిఆర్‌ఎస్ పార్టీ కాని చెప్పటం లేదని, మన కేంద్ర సిడబ్ల్యూసి చెప్పిన విషయమని పేర్కొన్నారు. ఇదీ దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన వారి పనితీరు అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. రైతులు ఎల్లకాలం పోరాటాలు చేస్తూ బలికావాల్సిందేనా సిఎం ప్రశ్నించారు. ఇంత పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News