Sunday, December 22, 2024

ఫడ్నవీస్ హామీ ఇస్తే.. నేను మహారాష్ట్రకు రావడం మానేస్తా: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో బిఆర్ఎస్ ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ సభలో మాట్లాడుతూ… దేవేంద్ర ఫడ్నవీస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోహలో బిఆర్ఎస్ సభకు డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. దేశంలో త్వరలో రైతుల తుపాన్ రాబోతోంది.. దాన్నెవరూ ఆపలేరని స్పష్టం చేశారు. కెసిఆర్ కు ఇక్కడేం పని మాజీ సిఎం ఫడ్నవీస్ అంటున్నారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ లాగా రైతుకు ప్రతి ఎకరాకు 10 వేలు ఇవ్వాలి, రైతుభీమ ద్వారా తెలంగాణ రైతులకు రూ.5 లక్షలు ఇస్తున్నాం. తెలంగాణలో దళితుల కోసం దళిత బంధు పథకం తెచ్చాం. ఇది దేశంలోనే అద్భుతమైన పథకం అని ఆయన అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ దళితబంధు అమలు చేస్తానని హామీ ఇస్తే నేను మహారాష్ట్రకు రావడం మానేస్తానని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News