- Advertisement -
మహబూబ్ నగర్: ధరణి రద్దు చేస్తే.. మళ్లీ ఎమ్మోర్వో, ఆర్డీవోల పెత్తనం పెరుగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను హెచ్చరించారు. రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణి తెచ్చానన్నారు. ధరణి ఉండటం వల్లే అందిరికీ రైతుబంధు వేయగలుగుతున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ధరణి ఉండటం వల్లే ధాన్యం డబ్బులు సకాలంలో వస్తున్నామని చెప్పారు. ఎవరి పైరవీ లేకుండానే 15 నిమిషాల్లో భూములు రిజిస్ట్రేషన్ జరుగుతోందన్నారు. ధరణి రద్దు చేస్తే… మళ్లీ దళారులు రాజ్యం వస్తుందని కెసిఆర్ ప్రజలకు సూచించారు. అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీ గురువారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కెసిసిఆర్ హాజరయ్యారు.
- Advertisement -