Monday, December 23, 2024

కిరణ్ కుమార్ రెడ్డి అలా మాట్లాడినా ఒక్క నేత నోరెత్తలే

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: తెలంగాణ ఎన్నో అంశాల్లో నంబర్ వన్ గా ఉందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అన్నారు. మేడ్చల్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… రూ. 30 లక్షలు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఉచితంగా ఇచ్చామని తెలిపారు. ఉన్న తెలంగాణను లేకుండా చేసిందెవరో ప్రజలు ఆలోచించాలని సిఎం సూచించారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అన్న విషయాన్ని కెసిఆర్ గుర్తుచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి అలా మాట్లాడినా ఒక్క కాంగ్రెస్ నేత నోరేత్తలేదని ఆయన ఫైర్ అయ్యారు. అటు మేడ్చల్ సభలో సిఎం కెసిఆర్ చేతులమీదుగా ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News