Thursday, January 23, 2025

పివి మన ఠీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నర్సింహారావు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు పివి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. పూర్వ భారత ప్రధాని పివి నరసింహరావు 102వ జయంతి (జూన్ 28) సందర్భంగా సిఎం కెసిఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు, తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ..‘

దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని పివి నర్సింహారావు’ అని సిఎం కొనియాడారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ పివి నర్సింహారావుకే దక్కుతుందని తెలిపారు. పివి సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన మీద ఉన్నదని, వారి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సిఎం అన్నారు. ‘తెలంగాణ ఠీవి మన పివి’ అని సిఎం పునరుద్ఘాటించారు. పివి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News