నిరంతర విద్యుత్ సరఫరా
సిఎం కెసిఆర్ ముందు చూపే కారణం
విఏవోఏటీ సర్వసభ్యసమావేశంలో
ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు
మన తెలంగాణ,సిటీబ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం కానివ్వమని ఇదే అంశంపై గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని రాష్ట్రజెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండి దేవుల పల్లి పభాకర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం జిటిఎస్ కాలనీలోని జెన్‌కో ఆడిటోరియంలో జరిగిన విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్యసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌రంగంలో మార్పులు తీసుకు వచ్చేందుకు చట్టం తీసుకువస్తుందని, దాన్ని సీఎం కేసిఆర్ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రం సాధించిన అతి కొద్ది కాలంలోనే విద్యుత్‌ను అన్ని రంగాలకు నిరంతర సరఫరా చేస్తూ దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సాధించామని దీనికి ప్రధాన కారణం సీఎం కేసిఆర్ ముందు చూపే అన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు విద్యుత్ సమస్యను గట్టేక్కించే అశంపై ప్రతి రోజు చర్చిండమే కాకుండా విద్యుత్ రంగానికి మొదటి ప్రాధాన్య ఇవ్వడంతో ఇది సాధ్యమైనట్లు తెలిపారు. నేను విద్యుత్ పితామహుడిని కాదని దీనికి మొదటి వ్యక్తి సీఎం కేసిఆర్ మాత్రమే అన్నారు. కేసిఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించక పోతే తెలంగాణలో పవర్ సెక్టార్‌కు అసలు గుర్తింపే లేదన్నారు. బొగ్గు నిల్వలు లేక దేశమంతా విద్యుత్ సరఫరాలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కూడా మన రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా జరపడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను సరఫరా చేశామన్నారు.
నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చి మంచి గుర్తింపు పొందామని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యుత్ ఉద్యోగులందరిపై ఉందన్నారు. సంస్థ బ్యాలెన్స్ షీట్ మీదనే అభివృద్ది ఆధాపరి ఉంటుందని సీఎండి సూచించారు. విద్యుత్ ఉద్యోగులు సమస్యలకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో కలిసి త్వరలో సీఎంను కలుద్దామన్నారు.అంతకు ముందు సీఎండి ప్రభాకర్‌రావుపై నిర్మించి 25 నిమిషాల డాక్యుమెంటరీపై విఏవోఏటీ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌పిడీసీఎల్ సీఎండి గోపాల్‌రావు మాట్లాడుతూ సంస్కరణలకు అనుగుణంగా పని చేస్తూ ముందుకు పోవాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. విద్యుత్ రంగంలో మార్పులు రానున్నాయని ట్రాన్స్‌కో జేఎండి శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర తీసుకు వస్తున్న విద్యుత్ సవరణ చట్టం ద్వారా సంస్థ ప్రైవేటీకరణవైపు అడుగులు పడే అవకాశం ఉందన్నారు. వినియోగదారులు పెరుగుతున్న దృష్టా ఉద్యోగుల సంఖ్య పెంచాలని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంజయ్యతెలిపారు.
గతంలో 50 వేల మందికి వినియోగదారులకు ఒక జేఏవో పని చేస్తుంటే ప్రస్తుతం రెండు లక్షల మందికి ఒక జేఏవో పని చేయాల్సి వస్తోందన్నారు.జేఏవోల నియమించడం ద్వారా పని ఒత్తిడి తగ్గించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విఏవోఏటీ అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌పిడీసీఎల్ ఫైనాన్స్ డైరక్టర్ నర్సింగరావు, సీజీఎంలు తిరుపతి రెడ్డి, పి. ఆనంద్, పలు అసోసియేషన్ల ప్రతినిధుల రత్నాకర్‌రావు ,శివాజీ, సదానంద్,మేడి రమేష్, తుల్జారాంసింగ్, పున్నయ్య, బీసీ రెడ్డి, వినోద్‌మాకుర్, శంకర్ ,జాన్సన్ కరెంట్‌రావు,సంపత్‌రావు, శ్రీధర్ ,వజీర్, శ్యామరాలు, నాజర్ షరీఫ్, నాగరాజు ,అనురాధ ,మల్లం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.