Wednesday, January 22, 2025

సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపిన సిఎం, మంత్రులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సాయన్న మృతిపట్ల సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు, మంత్రులు సంతాపం తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ సాయన్న(72) ఆదివారం ఉదయం కన్నుమూశారు. సాయన్న ఐదుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచి అరుదైన ఘనత సాధించారని కెసిఆర్ పేర్కొన్నారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని ప్రశంసించారు.సాయన్న కుటుంబానికి సిఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయన్న ఆకస్మిక మరణం చాలా బాధాకరమని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంఎల్‌ఎ కుటుంబ సభ్యులకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News