Saturday, November 23, 2024

సిరివెన్నెల మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ”సంగీత ప్రక్రియలతో పెనవేసుకుపోయే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. సిరివెన్నెల పండిత పామరుల హృదయాలను గెలిచారు. ఆయన మరణం తెలుగు చిత్ర రంగానికి తీరని లోటు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి” అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07గంటలకు తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన విశాఖపట్నంలోని అనకాపల్లిలో 1955 మే 20న జన్మించారు. కాగా, సిరివెన్నెల మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

CM KCR Condolence to Sirivennela Seetharama Sastry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News