Sunday, January 19, 2025

సీనియర్‌ జర్నలిస్ట్‌ మృతి పట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీహెచ్‌వీఎం కృష్ణారావు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 64. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సిహెచ్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.

పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజాప్రయోజనాల కోణంలో కృష్ణారావు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టివి చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవన్నారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సిఎం పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News