Monday, December 23, 2024

తారకరత్న మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నందమూరి తారకరత్న మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న బెంగళూరులోని నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్‌లో శనివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు గుండెపోటు జనవరి 27న ఆస్పత్రిలో చేరాడు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఎన్టీఆర్ కుమారుడు, నందమూరి మోహన్ కృష్ణ తనయుడైన తారకరత్న 1983 జనవరి 22న జన్మించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News