హైదరాబాద్: ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ వాణీ జయరాం మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం సినీ రంగానికి అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వం పదభూషణ్ అవార్డు ప్రకటించింది. వాణీ జయరాం హఠాన్మరణ వార్త దేశవ్యాప్తంగా సినీ సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సినీ సంగీత ప్రయాణంలో 10 వేలకు పైగా పాటలను పాడారు. మూడు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్నారు. కళా తపస్వి కె విశ్వనాథ్ మరణవార్త దిగ్భ్రాంతి నుంచి తెలుగు ప్రజలు ఇంకా కోలుకోకముందే వాణీ జయరాం చనిపోయారన్న వార్త ప్రజలను తీవ్ర విషాదంలో ముంచివేసింది. వాణీ జయరాం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
వాణీ జయరాం మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
- Advertisement -
- Advertisement -
- Advertisement -