Monday, December 23, 2024

బిజెపి మాజీ ఎంపి జంగారెడ్డి మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం..

- Advertisement -
- Advertisement -

వరంగల్: బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి చందుపట్ల జంగారెడ్డి(87) మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935న జన్మించారు. 1984లో హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు.

CM KCR Condoles demise of Ex MP Jangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News