Wednesday, January 22, 2025

లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారని ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారత దేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం అన్నారు. లతా జీ మరణంతో పాట మూగబోయినట్లైందని, సంగీత మహల్’ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. స్వర్గీయ లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, లతా మంగేష్కర్ 1942లో తన 13వ ఏట తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ భారతీయ భాషలలో ఆమె ఇప్పటివరకు 30 వేలకు పైగా పాటలు పాడారు. గానకోకిలగా పేరుగాంచిన లతను భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోపాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించాయి.

CM KCR Condoles demise of Lata Mangeshkar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News