Wednesday, January 22, 2025

సంపతమ్మ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు, హిందుస్థాన్ టైమ్స్ అసోసియేట్ ఎడిటర్ ఎ. శ్రీనివాస్ రావుల తల్లి సంపతమ్మ (88) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మఖ్దూమ్ మొహియుద్దీన్‌తో వీరి తండ్రి అప్పరుసు శేషగిరి రావు కలిసి పనిచేశారు. శేషగిరి రావు భార్య దివంగత సంపతమ్మ కరుడుగట్టిన తెలంగాణ వాది. ఆమె సిఎం కెసిఆర్‌కి వీరాభిమాని. ఉద్యమం, ఆ తర్వాత ప్రభుత్వం అనేక సందర్భాల్లో తెలంగాణ వాదాన్ని వినిపించేవారు. వారికి ఐదుగురు కుమారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News