Monday, December 23, 2024

మంత్రి సత్యవతి తండ్రి మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ లింగ్యా నాయక్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ను ఫోన్ లో సీఎం కెసిఆర్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిఎం కెసిఆర్ తోపాటు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి‌ కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ గురువారం తెల్లవారుజామున జిల్లాలోని కురవి మండలం పెద్ద తండాలోని తన నివాసంలో కన్నుమూశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి సత్యవతి.. తండ్రి మరణవార్త తెలియడంతో వెంటనే పెద్దతండాకు బయలుదేరారు.

CM KCR Condoles to Satyavathi Rathod’s father demise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News