Sunday, January 19, 2025

ఆస్ట్రేలియా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కాసర్లను అభినందించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎన్నికల ప్రచారంలో తన బృందంతో తిరుగుతూ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ జిల్లాలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని సిఎం కెసిఆర్ అభినందించారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల ప్రచారం కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నాగేందర్ రెడ్డి ఆయన బృందాన్ని జగిత్యాల ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన సిఎం కెసిఆర్ ఆదివారం ప్రశంసించారు.

ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ తమ కృషిని గుర్తించడం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ది ఎప్పటికీ కొనసాగాలంటే కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలని, ప్రతి ఎన్నికల సమయంలో తమ బృందంతో ఆస్ట్రేలియా నుంచి తెలంగాణకు వచ్చి బిఆర్‌ఎస్‌కు మద్ధతుగా ప్రచారం చేస్తామని, అందులో భాగంగానే నేడు గడపగడపకు కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూనే కెసిఆర్‌ను మూడోసారి గెలిపించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News