Wednesday, January 22, 2025

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

CM KCR congratulated Bakrid

హైదరాబాద్ : త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ, బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా)సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెబుతుందని సిఎం తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవుని పై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందని సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News