Thursday, January 23, 2025

బాలికల భద్రతకు సెఫ్టీ క్లబ్ ఏర్పాటు : సిఎస్

- Advertisement -
- Advertisement -

సిఎస్ శాంతికుమారిని అభినందించిన ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలో బాలికల భద్రతకు సెఫ్టీ క్లబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో సీట్లో ఆమె ఆసీనులయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఛాంబర్‌కు శాంతికుమారికి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని పాఠశాలల్లో బాలికల భద్రతకు సెఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేసే ఫైల్ పై శాంతి కుమారి సంతకం చేశారు. అంతకుముందు ఛాంబర్‌లో ప్రత్యేక పూజలను సిఎస్ నిర్వహించారు. సిఎస్‌ను సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. నూతన సచివాలయ ఆవరణలో జరిగిన హోమంలో ఆమె పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News