Thursday, November 14, 2024

రూ.3 కోట్ల విలువైన టమాటా పంట పండించిన మహిపాల్ రెడ్డి దంపతులకు..

- Advertisement -
- Advertisement -
 సిఎం కెసిఆర్ అభినందనలు

హైదరాబాద్ : మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్‌కు చెందిన రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. సోమవారం నర్సాపూర్ ఎంఎల్‌ఎ చిలుముల మదన్ రెడ్డితో వచ్చిన రైతు మహిపాల్ రెడ్డి సోమవారం సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటా పంటను అమ్మామని, మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని మహిపాల్ రెడ్డి సిఎంకు వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. సిఎంను కలిసిన వారిలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News