Sunday, December 22, 2024

ఈషా సింగ్ ను అభినందించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్ టీం 1,759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి, టీమ్ స్పిరిట్‌ను చాటిందని సిఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలుచేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సిఎం ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News