Thursday, January 23, 2025

ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ’ఇగురం‘ కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని ఈ రోజు సిఎం కెసిఆర్ అభినందించారు. మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి సిఎం కెసిఆర్ ని ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. గంగాడి సుధీర్ రెడ్డిని కెసిఆర్ ఇగురం రచయితవు కదా… చాలా బాగా రాస్తున్నావని, కీప్ రైటింగ్ అని గుర్తుపట్టి అభినందించారు. కెసిఆర్ తనని గుర్తుపట్టడం, ఇగురం పుస్తకం గురించి విన్నాను, చదివాను అని స్వయంగా ఆయనే తనతో ప్రస్థావించడంతో తన ఆనందాన్ని మీడియాతో గంగాడి పంచుకున్నారు. తన తొలి పుస్తకం ఇగురం సిఎం కెసిఆర్ వరకు చేరడం, ఆయన దాన్ని చదవడం అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని గొప్ప అనుభూతి కలిగించిందన్నారు. ఈ సందర్బంగా సిఎం తాను కలువడానికి కారణమైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, అభినందించిన కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మానేరు గడ్డపై పుట్టడం, హైదరాబాద్ విబిన్న సంసృతి, తెలంగాణకున్న ఘనమైన సారస్వత వారసత్వం, సాహితీ సుక్షేత్రమే తన రచనలకు ఆలంభనమని, మంచి సాహిత్యాన్ని ఆదరిస్తున్న పాఠకులకు, పాలకులకు, తెలంగాణ ప్రభుత్వానికి ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News