Sunday, December 22, 2024

ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం కెసిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సేఫ్ లాండింగ్ అనే చివరి ఘట్టాన్ని చేరుకోవడం ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇస్రోశాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు లాండర్ మాడ్యూల్ ను విజయవంతంగా చేర్చిన మొట్ట మొదటి దేశంగా,ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత దేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని, అరుదైన చరిత్రను సృష్టించిందని సిఎం తెలిపారు.ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సందర్భం అని సిఎం కెసిఆర్ అన్నారు.

ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి, ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో యావత్ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజని సీఎం అన్నారు.భవిష్యత్‌లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చంద్రయాన్ 3 విజయం గొప్ప ప్రేరణనిస్తుందని సిఎం పేర్కొన్నారు.ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచే దిశగా, అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో తన విజయపరంపరను కొనసాగించాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News