Monday, December 23, 2024

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్ దంపతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సిఎం కెసిఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

సిఎం కెసిఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్,జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సిఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మారావు కుటుంబసభ్యులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ వెంట ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News