Thursday, January 23, 2025

కె-కొత్త… సి-చరిత్ర… ఆర్-రాయడం (కెసిఆర్): జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సరికొత్త భాష్యం చెప్పిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ అనే పదానికి టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి సరికొత్త భాష్యం చెప్పారు. కెసిఆర్ అంటే (కె…కొత్త, సి…చరిత్ర, ఆర్…రాయడం,,,కొలువులు …చదవులు…రిజర్వేషన్లు) అని ఆయన అభివర్ణించారు. బుధవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఒకే సారి 91,142 ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం ఒక్క సిఎం కెసిఆర్‌కే చెల్లిందన్నారు. ఉద్యోగాల భర్తీపై తప్పుడు ప్రచారం చేసిన బిజెపి, కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక సంపూర్ణమయ్యాయని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్ళు కడిగినమన్నారు. నిధులతో ఈ బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించారని చెప్పారు. నీళ్లు నిధులు తీసుకొచ్చి, నియామకాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మనబడితో విద్యానందిస్తున్నామన్నారు. ఇవాళ ఒక దుర్దినంగా ప్రతిపక్షాలు భావిస్తున్నారని, వాళ్లకు మాటలు రాకుండా సిఎం కెసిఆర్‌ర్ చేశారన్నారు. మొత్తం నియామకాలు భర్తీ చేయాబోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా నిరుద్యోగులు బిజెపి ట్రాప్‌లో పడవద్దని సూచించారు. తన నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు తన సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెడతానని ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News