రావుల శ్రీధర్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్, ఇంతియాజ్ ఇషాక్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. సిఎం ఆదేశాల మేరకు బుధవారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రావుల శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు బాధ్యతలు తీసుకున్న నుంచి రెండు సంవత్సరాల పాటు పదవీకాలంలో ఉంటారు. సంబంధిత శాఖలు కార్పొరేషన్ ఛైర్మన్‌కు కార్యాలయ వసతి, వాహనం, సిబ్బంది, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు.
సిఎం కెసిఆర్‌ను చైర్మన్లు కృతజ్ఞతలు..
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమింతులైన రావుల శ్రీధర్‌రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మెట్టు శ్రీనివాస్ కలిశారు.