- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సిఎం పేర్కొన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు ఆయన వెల్లడించారు. మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుందని సిఎం వివరించారు. 57 ఏళ్ల వయస్కులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పింఛన్లు ఇస్తామన్నారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు రూ.2,016 ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. వజ్రోత్సవ వేళ సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
- Advertisement -