Saturday, November 23, 2024

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం

- Advertisement -
- Advertisement -

గతంలో 13 కోట్లతో పాటు సీఎం కేసిఆర్ మరో 10 కోట్లు మంజూరు చేశారు…..
తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల ఆలయాన్ని సందర్శించిన స్పీకర్ పోచారం


మన తెలంగాణ/కామారెడ్డి: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ… భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో 13 కోట్లు మంజూరు చేయగా,  మిగతా పనుల కోసం మరో 10 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గడించిన దేవాలయ అభివృద్దికి సిఎం కెసిఆర్ కోట్ల రూపాయలను మంజూరు చేయడం హర్షనీయమని, ఈ సందర్బంగా సీఎం కేసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ నిధులతో దేవాలయానికి ప్రకారం, రాజ గోపురాలు, నూతన రథం, మాడ వీధులు, యజ్ఞశాల, నిత్యాన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, యాత్రికుల వసతి సముదాయం, వివాహ మండపం, కొండ మీదకి రెండు వరుసల రహదారి, పార్కింగ్, భక్తులకు అవసరమైన ఇతర వసతులను నిర్మిస్తున్నామన్నారు. పనులు సంపూర్ణంగా పూర్తి కావడానికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలన్నారు.

పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, పనులు పూర్తి కాగానే సిఎం కెసిఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. బీర్కూర్‌లో నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్లాసులు ప్రారంభం అవుతాయని, అదేవిధంగా బీర్కూర్ మండల కేంద్రంలోని బిసి రెసిడెన్షియల్ స్కూల్, కోటగిరిలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలుకు నూతన భవనాల నిర్మాణం కోసం రూ.5 కోట్ల చొప్పున మంజూరయ్యాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన నస్రుల్లాబాద్, రుద్రూర్, మోస్రా, చందూర్ మండల కేంద్రాలలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మండల కార్యాలయాల సముదాయం కోసం ఒక్కొక్క మండలానికి కోటి రూపాయల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్, ద్రోణవల్లి అశోక్, అప్పారావు, నర్సరాజు, బీర్కూర్ ఎంపిపి రఘు, ఆలయ కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News