హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉండడంతో సిఎం కెసిఆర్ యశోదా ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేశామని డాక్టర్ ఎంవి రావు తెలిపారు. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ముందు జాగ్రత్తగా పరీక్షలు చేస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ కు ప్రతి యేటా ఫిబ్రవరిలో రెగ్యులర్ హెల్త్ చెకప్ చేస్తుంటామని వివరించారు. రెండు రోజుల నుంచి కెసిఆర్ బలహీనంగా ఉన్నట్టు చెప్పారని వైద్యుడు ఎంవి రావు పేర్కొన్నారు.
యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/c1OjWtrrhM
— Telangana CMO (@TelanganaCMO) March 11, 2022