Sunday, December 22, 2024

పోడు కేసులు ఎత్తేస్తాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/కుమ్రం భీం ఫాబాద్: కొట్టేసినందుకు ఆది వాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామ ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇక వా రిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలా తోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. పోడు భూము ల విషయంలో గిరిజన రైతులు కాకుండా గిరి జనులు కానివారు కూడా ఉన్నారని, అయితే వా రు 75 ఏళ్లుగా ఒకచోట నివాసముంటున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకో సం ఒక ప్రక్రియను తీసుకొస్తామని, త్వరలోనే పనులు పూర్తిచేసి వారికి కూడా న్యాయం చేస్తా మని వెల్లడిం చారు. కుమ్రం భీంఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో సిఎం కెసిఆర్ అసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గ ఆదివాసీలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు.

పోడు పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు చెక్కులను సైతం అందజేశారు. అంతకుముందు ఆసిఫాబాద్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని, నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఎస్‌సి కార్యాలయాలను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. ఆసిఫాబాద్‌లో బిఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, దివంగత సాయిచంద్ చిత్రపటానికి సిఎం కెసిఆర్ పుష్పాంజలి సమర్పించి, నివాళి అర్పించారు.ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టాలు పొందిన ఆదివాసీ రైతులకు రూ.23.56 కోట్లు విలువ చేసే రైతుబంధు చెక్కులను అందించామని వివరించారు.

రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో పోడు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ఈ భూములకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని.. విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల్లో ఆదివాసీలు బోర్లు వేసుకునేందుకు గిరివికాసం పథకం కింద.. ప్రభుత్వం బోర్లను వేస్తుందని సిఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని అన్నారు. సమాజం చైతన్యవంతం అవుతున్న కొద్దీ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,51,000 మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News