Tuesday, January 21, 2025

కెసిఆర్ దమ్ము ఏందో దేశం మొత్తానికి తెలుసు

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: దేశం మొత్తంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీ గురువారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కెసిసిఆర్ హాజరయ్యారు. అనంతరం సభలో కెసిఆర్ ప్రసంగిస్తూ…. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిందన్నారు. ఇంటింటికి నల్లానీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 65 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నులు పండిస్తోందని కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. 24 గంటలు కరెంట్ ఇస్తే… కాంగ్రెస్ ను వీడి తెరాస కండువా కప్పుకుంటానని జానారెడ్డి సవాలు విసిరారు.. 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించాక ఏమయ్యారో తెలియదు అని సిఎం ఎద్దేవా చేశారు. కొడంగల్ కు రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా… అని కొందరు నాకు సవాలు విసురుతున్నారు.. కెసిఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసింది.. కొత్తగా చూపాల్సిన అవసరం తనకు లేదని సిఎం స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News