Monday, December 23, 2024

ఏమరుపాటుగా ఓటు వేస్తే… మన భవిష్యత్ ఆగం

- Advertisement -
- Advertisement -

బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాదసభ నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కెసిఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఏదీ మాట్లాడినా చెల్లుబాటు అవుతోందని భావిస్తున్నారు. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణితి ఇంకా పెరగటం లేదన్నారు.

ఏమరుపాటుగా ఓటు వేస్తే…. మన భవిష్యత్ ఆగం అవుతుందని కెసిఆర్ సూచించారు. ఒక్క అవకాశం ఇవ్వామని ఇవాళ కాంగ్రెస్ అడుగుతోంది, కాంగ్రెస్ కు ఒక్క అవకాశం కాదు… 11 అవకాశాలు ఇచ్చారని కెసిఆర్ పేర్కొన్నారు. 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందో ఆలోచించాలన్నారు. 2014 కు ముందు రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. దేశంలో తెలగాణ మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తోందన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ.. తలసరి విద్యుత్ వినియోగంలో ముందుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News