Wednesday, January 22, 2025

ప్రజలకు వెలుగులు నింపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : రాష్ట్ర ప్రజలకు వెలుగులు నింపిన ముఖ్యమంత్రి మన కెసిఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని స్థానిక గిరిజన భవన్‌లో విద్యుత్ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా జెండా ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. విద్యుత్ లేకపోతే ప్రపంచం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని తెలంగాణ రాకముందు ఎప్పుడు కరెంట్ ఉండేదో ఎప్పుడు పోయేదో తెలిసేది కాదని అన్నారు. రైతులకు సరైన విద్యుత్ లేక అనేక ఇక్కట్లు పడ్డారని అన్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ కల్పించిన ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. నిరంతరం మనకు విద్యుత్ వెలుగుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న విద్యుత్ శాఖ కార్మికులకు ఈ సందర్భంగా మెచ్చా కృతజ్ఞతలు తెలిపారు. నృత్యాలుచేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News