Friday, November 22, 2024

సిఎం విహంగ వీక్షణంలో మల్లన్న సాగర్

- Advertisement -
- Advertisement -

CM KCR examined Mallannasagar project through aerial view

నీటి నిల్వను తిలకించి పరవశించిన కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రాజెక్టులో అం తర్భాగమైన మల్లన్నసాగర్ జలాశయాన్ని సోమవారం నా డు ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్లిన సిఎం విహంగ వీక్షణం ద్వారా మల్లన్నసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యంత ఎక్కువగా 50 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంలో ఈ సీజన్ నుంచే నీటిని నింపుతున్నారు. ఈ ఏడాది పది టిఎంసిల నీటిని నింపాలని, ఈ జలాశయంలో ఏటా దశలవారీగా నీరు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తు తం మల్లన్నసాగర్ జలాశయంలో 10.6 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఈ సామర్థ్యంతో జలాశయం, కట్టను పూర్తి స్థా యిలో పరిశీలించి ప్రాజెక్టు పటిష్టత భధ్రతా పరంగా సం తృప్తి చెందాకే మళ్లీ నీటిని నింపుతారు. విహంగ వీక్షణం ద్వారా మల్లన్నసాగర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించారు.

ఇది వరకే ఒకసారి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకే ఒకసారి విహంగ వీక్షణం ద్వారా మల్లన్నసాగర్ను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ ప్రాజెక్టును విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈ ఏడాది జలాశయాన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విహంగ వీక్షణం ద్వారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. పల్లెలు, పట్టణాలకు మిషన్ భగీరథ పథకం పేరిట కొనాసాగుతున్న తాగునీటి సరఫరాకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం గరిష్ఠస్థాయిలో తన సేవలందించనుంది. ఈ క్రమంలో 50 టిఎంసిల సామర్థ్యం గల ఈ జలాశయం నుంచి ఐదు జిల్లాలకు చెందిన 14 నియోజకవర్గాలతోపాటు, హైదరాబాద్- ,సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరందించేందుకు శాశ్వత ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోలు గ్రామం వద్ద ప్రాజెక్టు లోపల ఇన్‌టేక్ వెల్, వెలుపల నీటి శుద్ధి కేంద్రం, పైపులైను నిర్మాణాలకు రూ.1212 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం అనుమతించి ఆమేరకు జీవో విడుదల చేసింది

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News