- Advertisement -
హైదరాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆదివాసీ, గిరిజనులకు సిఎం కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సిఎం వ్యాఖ్యానించారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. “మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం” అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. గిరిజనులకు సబ్ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నదన్నారు. గురుకులాల ద్వారా అత్యున్నతస్థాయి విద్యను, అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదీవాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
- Advertisement -