Monday, December 23, 2024

ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని సిఎం అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాకాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా సిఎం ప్రార్ధించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్దిల్లాలని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News