Tuesday, April 29, 2025

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉట్ల పండుగగా పిలుచుకుంటూ యువతి, యువకులు కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని సీఎం పేర్కొన్నారు.

శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని సిఎం కెసిఆర్ తెలిపారు. భగవద్గీత ద్వారా కర్తవ్యబోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించని స్థితప్రజ్ఞతతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని సిఎం కెసిఆర్ ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News