Monday, December 23, 2024

దుక్కిదున్నేటోని దుఃఖం తీర్చేందుకు మా పోరాటం…

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ ఉద్యమ పంథాలోనే .. రైతన్నల కోసం మరో ఉద్యమం…

వడ్లు కొంటారా… కొనారా … !! నినాదించిన రైతన్నలు..

కేంద్రానికి వరి నిరసన సెగ…

వెల్లువెత్తిన వరి నిరసన దీక్షలు…

మండల కేంద్రాల్లో వేల సంఖ్యలో దీక్షల్లో కూర్చున్న రైతన్నలు.. ప్రజాప్రతినిధులు.. పార్టీ శ్రేణులు..

CM KCR fight for farmers

సిద్దిపేట: నాడు ప్రజల ఆకాంక్షకు.. నేడు అన్నదాతల ఆవేదన కొరకు ఉద్యమ నేత, సిఎం కెసిఆర్ మరో ఉద్యమానికి నాంది పలికారు. టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు కేంద్రం వడ్లు కొనాలి అని డిమాండ్ చేస్తూ సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట ఆర్డీవో ఆఫీస్ వద్ద, నంగునూర్ ,చిన్నకోడూరు మండల కేంద్రం లోని ఎమ్మర్వో ఆఫీస్ ల వద్ద, నారాయణ రావు పేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లీ చౌరస్తా లో నిరసన దీక్షలు చేపట్టారు.. సిద్దిపేట ఆర్భన్ రూరల్ మండలల నిరసన దీక్ష లో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వంగా నాగి రెడ్డి, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు , మార్కెట్ కమిటీ పాల సాయి రామ్ ఆత్మకమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ మండల అధ్యక్షులు యాదయ్య, ఎద్దు యాదగిరి తదితరుల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

చిన్నకోడూరు మండలంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ , ఎంపిపి మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో, నంగునూర్ మండలంలో జడ్పీటిసి తడిసిన వెంకట్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, జాప శ్రీకాంత్, సోమిరెడ్డి, కొల రమేష్, మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు లింగం గౌడ్ ఆధ్వర్యంలో నారాయణ రావు పేట మండలంలో ఎల్లారెడ్డి , ఎంపిపి బాల మల్లు, వైస్ ఎంపిపి సంతోష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు , ఉప సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, రైతు బంధు కో ఆర్డినెటర్స్ మండల గ్రామ శాఖ అనుబంధ కమిటీలు, రైతులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. దుక్కిదున్నే రైతన్నకు కష్టం విలువ తెలుస్తోందని, ఆ రైతన్నా కోసం సిఎం కెసిఆర్ మరో ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందుకు ఈ రోజు నిరసన దీక్ష చేపట్టామన్నారు. దుక్కిదున్నేటోని దుఃఖం తీర్చేందుకు మా పోరాటం అని, కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ పంథాలోనే .. రైతన్నల కోసం మరో ఉద్యమం… వడ్లు కొంటారా… కొనారా అని కేంద్రాన్ని టిఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించాయి. ఈ ఉద్యమాన్ని వడ్లు కొనే దాకా ఆపేది లేదు అని, కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 8న అన్ని గ్రామాల్లో ప్రతి రైతు ఇంటి పైన నల్లా జెండా ఎగరేస్తామన్నారు.  11న సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టే దీక్ష తో ఢిల్లీ ప్రభుత్వం దిగిరావలని ఈ సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News