కేంద్రం యాసంగి వడ్లన్నీ సేకరించేలా
చేయడానికి రాజీలేని పోరాటం
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి,
తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను రైతాంగానికి వివరించి
ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి
రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు, రైల్వేలు, జాతీయ
రహదారులు, విమాన సర్వీసులను స్తంభింపచేయడానికి
కూడా వెనుకాడరాదు అంశాల ప్రాతిపదికగా
కార్యాచరణ రూపొందించాలని నలుగురు మంత్రులతో
జరిపిన ఏడు గంటల సుదీర్ఘ సమావేశంలో సిఎం కెసిఆర్
దిశానిర్దేశం? ఉద్యమ కార్యాచరణ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: ధాన్యం సేకరణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించాలని అందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులు, పార్టీ అగ్రనేతలను ఆదేశించినట్టుగా తెలిసింది. ఈ మేరకు శుక్రవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌తో పలువురు మంత్రుల భేటీ అ య్యారు. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పు వ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నా రు. సుమారుగా 7 గంటల పాటు సాగిన సమీక్షలో ఢిల్లీలో జరిగిన పరిణామాలు, లోక్‌సభలో ఎంపిలు చేసిన ఆందోళనలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ను కూలకుషంగా సిఎం కెసిఆర్ మంత్రులతో సమీక్షించారు. ధాన్యం సేకరణ విషయమై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని, తీవ్రస్థాయిలో ఉద్యమా లు చేసైనా రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రంపై రాజీలేని పోరాటం చేయాలని సిఎం కెసిఆర్ ఈ స మావేశంలో నిర్ణయించారు.
యాసంగి ధాన్యం వి షయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, తెలంగాణ పట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణులను రైతాంగానికి వివరించి ఉద్యమాల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సిఎం కెసిఆర్ మంత్రులను ఆదేశించినట్టుగా తెలిసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమాన ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన బిజెపి ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పంజాబ్‌కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయమని అన్నట్టుగా వ్యవహారించడాన్ని ఎండగట్టాలని సిఎం కెసిఆర్ మంత్రులకు సూచించినట్టుగా సమాచారం.
రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు కూడా తెలంగాణ రైతులను ఆదుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత ధోరణులకే వత్తాసు పలకడాన్ని ప్రజానీకానికి వివరించాలని సిఎం కెసిఆర్ మంత్రులకు దిశా నిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. అంతేగాక ఉద్యమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వేలు, జాతీయ రహదారులు, అవసరమయితే విమాన సర్వీసులను కూడా స్తంభింప చేసేందుకు కూడా వెనుకాడ వద్దని, ఈ అంశాలను కూడా ఉద్యమ కార్యాచరణలో పొందుపరచడానికి కసరత్తు చేయాలని సిఎం ఆదేశించినట్టుగా సమాచారం. ఈ మేరకు శనివారం ఉద్యమ కార్యాచరణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.