Thursday, January 23, 2025

భద్రాచలానికి శాశ్వత భరోసా

- Advertisement -
- Advertisement -

CM KCR finacial to Flood victims

రూ.1000కోట్లతో
ప్రత్యేక కాలనీలు

ప్రతి కుటుంబానికి
రూ.10వేల చొప్పున
తక్షణ

వరద ముంపు శాశ్వత
పరిష్కానికి ప్రత్యేక కాలనీలు
ఇందుకోసం వెయ్యి కోట్లను వెచ్చిస్తాం
ఇండ్లను ఎత్తైన ప్రాంతాల్లో…
సర్వాంగ సుందరంగా నిర్మిస్తాం
వరద బాధితులకు తక్షణ సాయం
కింద రూ. 10వేలు
కుటుంబానికి 20 కిలోల బియ్యం
చొప్పున రెండు నెలల పాటు పంపిణీ
భద్రాచలం వరద బాధితులకు భరోసా
ముంపునకు గురైన ప్రాంతాల్లో విస్తృతంగా
పర్యటించిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్/ భద్రాచలం : భద్రాచలంలో ప ట్టణంలో వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.1000 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన కా లనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ముంపు ప్రాం తాల ప్రజలను మరో ప్రాంతానికి తరలించేందుకు యుద్దప్రాతిపదికన తగు చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్ధిక సాయం కింద పదివేల రూపాయల చొప్పున అందించనున్నామన్నారు.

ఆదివారం భద్రాచలం ముంపు గ్రామాల్లో సిఎం కెసిఆర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ఇకపై భద్రాచలంలో వరద ముంపు సమ స్య తలెత్తకుండా శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. దీని కోసం అధునాతమైన కాలనీలను నిర్మిస్తామన్నారు. వరద బాధితుల కొత్తగా నిర్మించే ఈ ఇండ్లు అన్ని హంగులతో ఉండబోతున్నాయని వివరించారు. అలాగే వీటిని సాధ్యమైనంత మేరకు ఎ త్తైన ప్రదేశాల్లో నిర్మిస్తామన్నారు.భద్రాచలం, పినపాకలో భవిష్యత్తుల్లో ఇక వరద సమస్య అంటూ తలెత్తదన్నారు. గోదావరికి 90 అడుగుల మేర వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశా రు. కొత్త నివాస కాలనీల నిర్మాణాలతో సహా, భద్రాచలం సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులకు కలిపి మొత్తంగా భద్రాచలం ప్రాంతంలోని గోదావరి ముంపు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం కోసం చేపట్టే అన్నిరకాల పనులకుగానూ ఈ వెయ్యి కోట్ల నిధులను వెచ్చించనున్నామన్నారు. సింగరేణి సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రెండు నుంచి మూడు వేల ఇండ్ల కాలనీ నిర్మించబోతున్నామని కెసిఆర్ వెల్లడించారు.

బాధితులకు పరామర్శ
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సిఎం గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. అనంతరం భద్రాచలం జెడ్‌పి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించారు.

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యాయన్నారు. అయితే దేవుడి దయ వల్ల ఉధృత వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. సంబంధితప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు.

అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు
ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్య లు తీసుకుంటామని కెసిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా నీ టి మునిగి ప్రాంతాల్లో నిరంతరం బ్లీచింగ్ చేయించాలని రా ష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును కెసిఆర్ ఆదేశించారు. ఇం దుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులను అందజేస్తామన్నారు.

ఆలయం ముంపునకు గురికాకుండా చర్యలు
భద్రాచలం శ్రీరాముల వారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్ తెలిపారు. భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుం చి రక్షించి….. సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామన్నా రు. ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తానని కెసిఆర్ తెలిపారు. అలాగే సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

వర్షాల ముప్పు ఇంకా పోలేదు
ఇంకా వర్షాల ముప్పుతొలగిపోలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ నెలాఖరు దాకా వానలు పడనున్నాయన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరస్ట్ లు జరుగుతున్నాయన్నా రు. పర్యవసానంగా వరద ముంపు పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. నిరంతరాయంగా కురిసే వర్షాల వల్ల తలెత్తే ఉత్పాత్తానికి నిదర్శనమే ఈ వరదలు అని కెసిఆర్ అన్నారు.మరో 15రోజులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రిలాక్స్ కాకూండా అ నుక్షణం అలర్ట్‌గా ఉండాలన్నారు. కాగా దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదలకు సంబంధించిన అం శాలు తన దృష్టికి వచ్చాయన్నారు. మొండికుంట వాగు, పా లెం వాగు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని సిఎం పేర్కొన్నారు.

దేవుడి దయవల్ల కడెం నిలబడింది
కడెం ప్రాజెక్టు దేవుని దయ వల్ల నిలబడిందని కెసిఆర్ అన్నా రు.ఈ ప్రాజెక్టుకు నీటి వరద 2 లక్షల 90 వేల క్యూసె క్కులకు మించి దాటలేదన్నారు.
కానీ ఇపుడు 5 లక్షలకు మించి పో యినా ప్రాజెక్టు నిలబడిందన్నారు. ఇంకా వాగులు వంకలు పొంగుతున్నాయన్నారు. చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయని అన్నారు.

బాధితులకు తక్షణ ఆర్థిక సాయం
వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 వేల చొప్పున అందజేయడమే కాకుండా ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పంటలు నీట మునిగాయని…దానిపై సమగ్రంగా సమీక్షించి తగు సహా యం అందిస్తామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే ఖాళీ చేయించాలని సం బంధిత అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News