Sunday, January 19, 2025

కలిసి పిడికిలి బిగిస్తే

- Advertisement -
- Advertisement -

దేశానికి పెడుతున్న రైతులను నడిబజారుకు ఈడ్చిన దిక్కుమాలిన చరిత్ర కేంద్రంలోని బిజెపి సర్కారుదే కార్పోరేట్ సంస్థలను నెత్తిన పెట్టుకొని
రైతులను అరికాళ్లతో అణగదొక్కేందుకు యత్నిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగురీతిలో బుద్ధి చెప్పడానికి ఎంతోకాలం పట్టదు ఆయన ప్రభుత్వంపై
దేశవ్యాప్తంగా ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు రైతులకు మేము అండగా ఉంటాం రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడ
సాధించిన దాఖలా దేశ చరిత్రలో లేదు కేంద్రం తెచ్చిన నల్లచట్టాలపై పెద్దఎత్తున ఆందోళన చేసి రైతులు తమ డిమాండ్లు నెరవేర్చుకున్నారు
ఆ చట్టాలను రద్దు చేయించుకున్నారు.. వారందరికీ శతకోటి ప్రమాణాలు చేస్తున్నా, వినమ్రంగా నివాళులర్పిస్తున్నా పంజాబ్ గొప్ప నేల హరిత
విప్లవాన్ని తీసుకొచ్చి పంజాబ్ రైతులు దేశానికి అన్నం పెట్టారు నల్లచట్టాలపై పోరాడిన రైతులను కొందరు బిజెపి పెద్దలు వారిని కలిస్తాన్ ఉగ్రవాదులతో
పోల్చారు రైతులు వారికి దేశద్రోహులు, ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారా? ప్రాణాలు తీసిన సాగు మోటార్లకు మీటర్లు బిగించబోమని చెప్పాం రైతులు
పండించిన పంట విలువకు రాజ్యాంగ పరమైన రక్షణ లభించేదాకా పోరాడుదాం దేశం కోసం చైనా సైనికులతో కొట్లాడి అమరుడైన కల్నాల్
సంతోష్‌బాబు మా తెలంగాణ బిడ్డే ఆ ఘటనలో వీర మరణం పొందిన పంజాబ్ బిడ్డల కుటుంబాలను పరామర్శించాలని ఎప్పుడో అనుకున్నా కానీ
పంజాబ్ ఎన్నికలు జరిగాయి.. అందుకే రాలేకపోయా : చండీగఢ్ ఠాగూర్ ఆడిటోరియంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్
మాన్‌లతో కలిసి అమరులైన 600మంది రైతులు, సైనికుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున సాయం అందించిన సందర్భంగా సిఎం కెసిఆర్

కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముంది. అందరం కలిసి పిడికిలి బిగిస్తే రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన గుజరాత్‌కు ఆయనను తిరిగి పంపించవచ్చు.

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి అన్నం పెడుతున్న రైతులను బజార్‌కు ఈడ్చిన దిక్కుమాలిన చరిత్ర కేంద్రంలోని బిజెపి సర్కార్‌దేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలను నెత్తిన పెట్టుకుని రైతులను అరికాళ్లతో అణగదొక్కేందుకు యత్నిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పేందుకు ఇంకా ఎంతోకాలం పట్టదన్నారు. ఆయన ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల విషయంలో కేంద్రం ‘అమ్మ పెట్టదు.. అన్న చందగా వ్యవహస్తోందని మండిపడ్డారు. రైతులను ఆదుకునేందుకు మనస్సు రాని కేంద్ర ప్రభుత్వానికి, కళ్లలో పెట్టుకుని చేసుకుంటున్న తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష పెంచుకుంటోందని దుయ్యబట్టారు. ఆ ప్రభుత్వాలను ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లతో కలిసి చండీగడ్ ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన 600 కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ, కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. అందరం కలిసి పిడికిలి బిగిస్తే మోడీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన గుజరాత్‌కు పంపవచ్చునని అన్నారు. అంతటి శక్తి దేశ రైతులకు ఉందన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలను మార్చిన శక్తి రైతులకు ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ మరోసారి గుర్తు చేశారు. అనేక ఆటుపోటులను ఎదుర్కొనే సత్తా ఉన్న రైతులు ఒంటరయ్యామని ఎప్పుడు ఆందోళన చెందవద్దన్నారు. తామంతా అండగా ఉంటామని కెసిఆర్ పూర్తి భరోసానిచ్చారు. దేశవ్యాప్తంగా రైతులు చేసే ఎలాంటి ఉద్యమానికైనా టిఆర్‌ఎస్ ప్రభు త్వం సంపూర్ణంగా అండగా ఉంటుందన్నారు. రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మనగడ సాగించిన దాఖలాలు దేశ చరిత్రలో లేదన్నారు. వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అత్యంత బాధాకరమని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సభలను సంతోషంతో ఏర్పాటు చేయడం లేదన్నారు. ఎంతో బాధతో నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి సభలను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో తన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయన్నారు.

చాలా దుఃఖం వస్తోందన్నారు. మన దేశం ఇలా ఎందుకుంది? గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మూలాలేమిటన్న విషయంపై ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఆయా కారణాలపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ కూడా జరగాలన్నారు. కేవలం ఒక ముఖ్యమంత్రిగానే కాదు.. భారతదేశానికి చెందిన ఓ పౌరుడిగా చర్చ జరగాలని కోరుకుంటునని కెసిఆర్ అన్నారు. అవసరమైతే ప్రజలు మరోసారి పోట్లాడాల్సి ఉంటుంది. మరణించాల్సి ఉం టుందన్నారు. దేశం కోసం జీవితాలు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రపంచంలో సమస్యలు లేని దేశమంటూ ఉండదనిన్నారు. కానీ ఇలాంటి సమస్యలున్న దేశాలు మాత్రం ఉండవన్నారు. రైతు సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలపై రైతులు పెద్దఎత్తున ఆందోళనలను చేసితమ డిమాండ్లను నెరవేర్చుకున్నారన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాగు చట్టాలను రద్దు చేయించుకున్నారన్నారు. వారందరికీ శతకోటి ప్రణామాలు చేస్తున్నానని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అయితే రైతు ఉద్యమంలో అసువులు బాసిన వారిని తిరిగి తీసుకురాలేమన్నారు. అలాంటి వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఉడతా భక్తిగా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్రం పక్షాన ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు.

పంజాబ్ గొప్ప రాష్ట్రం….గొప్ప నేల

పంజాజ్ రాష్ట్రం చాలా గొప్పది…గొప్ప నేల అని కెసిఆర్ అన్నారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ ఎలా మర్చిపోతామని కెసిఆర్ అన్నారు. వారి చేసిన సేవలను సువర్ణక్షరాలతో లిఖించవచ్చునని అన్నారు. షహీద్ భగత్ సింగ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తి అని…. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న రాఫ్ట్రం పంజాబ్ అని కితాబిచ్చారు. దేశానికి పంజాబ్ రాష్ట్రం గొప్ప సేవలు చేసిందన్నారు. వాటిని ఎవ్వరూ మరిచిపోలేరన్నారు. దేశవ్యాప్తంగా అన్నపానాదులకు కష్టంగా ఉన్న సమయంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని ప్రశంసిచందరు. ఆ సమయంలో పంజాబ్ రైతులు దేశానికి అన్నం పెట్టారన్నారు. ఇంత గొప్ప సేవలు చేసిన పంజాబ్ రైతులను ఎవరి విస్మరించగలరని ప్రశ్నించారు.

ఆందోళన చేయండి… అండగా ఉంటాం

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే వారిని కొందరు బిజెపి పెద్దలు ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా పోల్చారని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వక్తం చేశారు. రైతులు వారికి దేశద్రోహులు, ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. ఇంతకన్నా దురదృష్టకరం మరోటి ఉండదన్నారు. పైగా రైతుల సంక్షేమం కోసం మాట్లాడే ప్రభుత్వాలన్నా… ముఖ్యమంత్రులన్నా మోడీ సర్కార్‌కు నచ్చదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని తాను కోరుతున్నానని అన్నారు. ఈ ఉద్యమానికి తాము సంపూర్తమంగా మద్దతిస్తున్నామన్నారు. కేవలం పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలనుండే కాకుండా యావత్ భారతదేశం నుండి ఈ ఉద్యమం నడవాలన్నారు.తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి రైతులందరూ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయని కెసిఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఎంతో చేస్తోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక మునుపు మా రైతుల గోస వర్ణనాతీతంగా ఉండేదన్నారు. ఒక్క రోజే 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.

విద్యుత్ సమస్య కూడా ఉండేదన్నారు. అర్ధరాత్రి కరెంట్ సరఫరా వల్ల ఎందరో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భగవంతుని దయతో విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. ప్రధానంగా వ్యవసాయరంగానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాను ఎత్తివేయడానికే కేంద్ర ప్రభుత్వం కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న కొత్త నిబంధన తీసుకొచ్చిందని మండిపడ్డారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో బిజెపి పెద్దలు చెప్పాలని ఈ సందర్భంగా కెసిఆర్ డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులంటే మోడీ సర్కార్‌కు ఎందుకింత పగ అని నిలదీశారు. రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోందని మండిపడ్డారు.

ఇది మన హక్కు

దేశానికి, ప్రపంచానికి మనం ఆహారం అందిస్తున్నామన్నారు. పొలాల్లో చెమటోడ్చి పంట పండిస్తున్నామని కెసిఆర్ అన్నారు. రైతులు పండించిన పంట విలువకు రాజ్యాంగపరమైన రక్షణ లభించేదాకా పోరాటం ఆపకూడదన్నారు. రైతులకు న్యాయం దక్కాలన్నారు. ఇది మన హక్కు అన్న విషయాన్ని విస్మరించవద్దు అని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఈ అంశానికి కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకి మనం మద్దతివ్వాలన్నారు. దేశవ్యాప్తంగా రైతు నాయకులు ఈ రకమైన పరిస్థితి సృష్టించినప్పుడు రైతు పండించిన పంటకు రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుందని కెసిఆర్ అన్నారు. ఇందుకోసం రైతు పక్షపాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఏకమవుతాయన్నారు. ఇప్పటి నుంచి రైతుల ఉద్యమాలకు తాము కూడా తోడుగా ఉంటామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నడిచిన రైతు ఉద్యమానికి కేజ్రివాల్ తమవంతు సహాయం చేశారన్నారు. రైతులను రక్షించే ప్రయత్నం చేశారన్నారు. నేపథ్యంలోకేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్‌లను తీర్చే వరకు పోరాటానికి టిఆర్‌ఎస్ పార్టీ,రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంపూర్ణ మద్దతునిస్తామన్నారు.

కల్నల్ సంతోష్ మా తెలంగాణ వాసే…

చైనా సైనికులతో దేశం కోసం కొట్లాడి, అమరుడైన కల్నల్ సంతోష్ బాబు మా తెలంగాణ ప్రాంతం వారని కెసిఆర్ అన్నారు.. ఆయనతో పాటు పంజాబ్ సైనికులు కూడా వీరమరణం పొందారు. ఆ ఘటన తర్వాత వీర మరణం పొందిన పంజాబ్ కుటుంబాలను పరామర్శించాలని తాను అనుకున్నానని అన్నారు. కానీ ఆ సమయంలో పంజాబ్‌లో ఎన్నికలు జరిగాయని….అందుకే రాలేకపోయానని కెసిఆర్ అన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో కూడా పంచుకున్నానని తెలిపారు. ఇందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఈ కార్యక్రమానికి మద్దతిచ్చారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News