Thursday, January 23, 2025

పంటలా.. మంటలా?

- Advertisement -
- Advertisement -

మతపిచ్చిగాళ్ల మాయలో పడి తెలంగాణను ఆగం చేసుకోవద్దు రాష్ట్రాన్ని రావణ
కాష్ఠం చేయాలని ప్రయత్నిస్తున్నారు మేధావులు, విద్యావంతులు మౌనం వీడాలి
ఎనిమిదేళ్లు కష్టపడి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టాం అవి
కొనసాగాల్నా.. వద్దా ఎన్నాళ్లో కష్టపడిన తరువాతే బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్
ఇండియాగా అవతరించింది ఇప్పుడు బిజెపి పాలనలో భ్రష్టు
హిజబ్, హలాల్ గోలతో వెనకబడింది ఉపాధి కల్పనలో హైదరాబాద్
బెంగళూరును దాటేసింది : సిఎం కెసిఆర్

CM KCR fire on BJP

మన తెలంగాణ/హైదరాబాద్:  పచ్చటి పంటలు పండే రాష్ట్రం కావాలో? లేదా మత పిచ్చితో మంటలు మండే తెలంగాణా కావాలో ప్రజలే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రం చాలాం ప్రశాంతంగా ఉందన్నారు. అద్భుతమైనరీతిలో శరవేగంగా అ భివృద్ధి జరుగుతుందన్నారు. అలాంటి రాష్ట్రం లో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జ రుగుతున్నాయన్నారు. ఆ దుర్మార్గులు.. చిల్లరగాళ్లు మత పిచ్చిగాళ్ల మాయలో ప్రజలు పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గు రువారం ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్‌లో 44 ఎకరాల్లో రూ.58 కోట్లతో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. జిల్లాకు చక్కటి సమీకృత పరిపాలన భవనాన్ని నిర్మించి ప్రా రంభించనందుకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలిజయజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కెసిఆర్  ప్రసంగించారు. మనలో ఐక్యత దెబ్బతిన్ననాడు….మత శక్తుల పిచ్చికి లోనయిన్పపుడు మళ్లీ పాత తెలంగాణలాగా తయారవుతామని ఆయన హెచ్చరించారు. బతుకులు ఆగం అవుతాయన్నారు. వీళ్లు (బిజెపి) ఎక్కడా ఉద్దరించింది లేదన్నారు. కుట్రలకు కాలు దువ్వుతున్నారని మండిపడ్డారు. స్వార్థ, నీచ, మతపిచ్చిగాళ్లను మనం ఎక్కడికక్కడ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మోసపోతే గోస పడుతామన్నారు. మతపిచ్చికి లోనైతే ఒక వంద సంవత్సరాలు తెలంగాణతో పాటు భారతదేశం ఆగమైతదన్నారు. ఒక్కసారి దెబ్బతింటే విభజన వస్తే సమాజానికి మంచిది కాదన్నారు. ప్రేమతో, గౌరవంతో, అనురాగంతో బతికే సమాజం బాగుపడుతదన్నారు. కానీ కర్ఫ్యూలతో లాఠీఛార్జీలతో కోపంతో అసహ్యాంతో ఏ సమాజం కూడా పురోగమించిన దాఖలాలు లేవన్నారు. అలాంటి దానికి మన రాష్ట్రం బలికావొద్దన్నారు. ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలన్నారు. శాంతికి మన రాష్ట్రమే నడుం కట్టాలన్నారు. దానికోసం మనందరం ముందుకు పోదామన్నారు.

రాష్ట్రాన్ని ఆగం కానివ్వను

తన ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తానని అన్నారు. తన బలగం ప్రజలేనని అన్నారు. మీ అండదండలు ఆశీర్వచనం ఉన్నంత వరకు తనకేం కాదన్నారు. మత పిచ్చిగాళ్ల ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వనని హెచ్చరించారు. మత పిచ్చికి లోనైతే బతుకులు ఆగమవుతాయన్నారు. స్వార్థ మత పిచ్చిగాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఈ సందర్భంగా సిఎం పిలుపునిచ్చారు. సమాజంలో అసూయ, ద్వేశం పెరిగితే భారత్‌తో పాటు రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కి వెలుతుందన్నారు. ఒక ఇల్లు కట్టాలంటే చాలా సమయం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. మూఢనమ్మకాలు పిచ్చి… ఉన్మాదంతో వాటన్నింటిని రెండుమూడు రోజుల్లో కూలగొట్టొచ్చునని అన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ కోసం 58 సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చిందని కెసిఆర్ అన్నారు. దీని కోసం అనేక విధాలుగా పోరాటం చేసి విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. ఇందులో మనం కొంతమేరకు వి-జయం సాధించామన్నారు. ఇంకా సాధించాల్సింది ఉందన్నారు. ఆ దిశగా మనం ముందుకు సాగుతుంటే…కొందరు రాష్ట్రంలో మతం చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆగమాగం చేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి ఎపిలో ఉన్నప్పుడు ఇలాంటి సదుపాయాలు వస్తాయని రైతులు కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు కాపాడుకోవాలా వద్దా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.

మంచి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు

బెంగళూరు సిటీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిందన్నారు. దీని కోసం అక్కడి ప్రభుత్వాలు చాలా కష్టపడి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేశారన్నారు. 30 లక్షల మందికి ఐటిలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకుతున్నాయన్నారు. ఈ సంవత్సరం మన కంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఒక లక్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కానీ బెంగళూరులో ఈ ఏడాది ఏడెనిమిది వేల ఉద్యోగాలు తగ్గిపోయాయన్నారు. ఆ రాష్ట్రంలో హిజాబ్ అని, హలాల్ అని వాతావరణాన్ని కలుషితం చేస్తే బెంగళూరు ఈ ఏడాది వెనుకబడి పోయిందన్నారు. అలాంటి వాతావరణం తెలంగాణలో హైదరాబాద్‌లో రావాలా? అని ప్రశ్నించారు. మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోవాలా? అని అడిగారు.

ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు, రైతుల పథకాలు అమలవుతున్నాయని కెసిఆర్ అన్నారు. రైతుబీమా సదుపాయం యావత్ ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. ఒక గుంట ఉన్న రైతు చనిపోయినా వారం పది రోజుల్లో రూ. 5 లక్షలు బీమా కింద జమ అవుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతులు చాలా బాధలు పడుతున్నారు. కానీ తెలంగాణ రైతులకు ఆ బాధలు లేవన్నారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. దళారీ వ్యవస్థకు పూర్తిగా స్వస్తి పలికామన్నారు. పంటలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేసి… రెండుమూడు రోజుల్లోనే రైతుల డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. అలాగే పంటుపెట్టబడి సాయం కింది రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం అందిస్తున్న డబ్బులు కూడా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. దీంతో రైతుల అప్పులు చేయకుండా పంటలు పండిస్తున్నారు. 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు.

రాష్ట్రానికే బంగారు కొండ

రంగారెడ్డి జిల్లా రాష్ట్రానికే బంగారు కొండగా మారిందని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ జిల్లాలో ఒక్క ఎకరం భూమి ఉన్న వ్యక్తి కూడా పెద్ద కోటీశ్వరుడన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగే సమయంలో రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. భూములు ధరలు పడిపోతాయని, రాష్ట్రం వస్తే లాభం ఉండదని చెప్పారన్నారు. మనకు కరెంట్, మంచినీరు ఇవ్వని వారు మనల్ని గోల్ మాల్ చేసే ప్రయత్నం చేశారన్నారు. పట్టుదలతో 14 ఏండ్లు పోరాడితే చాలా త్యాగాల తర్వాత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. కొత్త జిల్లాలను సాధించుకున్నామని కెసిఆర్ తెలిపారు.

మేధావులు, యువత నిద్రాణమై ఉండొద్దు

ప్రజలను చైతన్యం చేసే మేధావులు, యువత నిద్రాణమై ఉండొద్దని కెసిఆర్ సూచించారు. అలా ఉంటే చాలా బాధలు అనుభవిస్తారన్నరు. మన సొంత చరిత్రనే మనకు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నామన్నారు. ఆ తదనంతరం నాటి నాయకత్వం ఏమరుపాటుగా ఉండడం వల్ల మనం ఎపిలో భాగమయ్యామన్నారు. ఫలితంగా అనేక బాధలు పడ్డామన్నారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సి వచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో అనేక సభల ద్వారా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేశామన్నారు. ఎపి నుంచి బయటపడేందుకు 1969లో జరిగిన ఉద్యమంలో 400 మంది పిల్లలు బలయ్యారు. మలిదశ ఉద్యమంలో అనేక మంది చనిపోయారన్నారు. కానీ మనం అహింసా పద్ధతిలో ముందుకు పోయినప్పటికీ అనేక బాధలు అనుభవింటచాల్సి వచ్చిందని కెసిఆర్ అన్నారు. బయటపడ్డ తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు కలుగుతున్న సదుపాయాలు మీ (ప్రజలు) కండ్ల ముందే ఉన్నాయన్నారు. మీరందరూ వాటిని చూస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News