Sunday, January 19, 2025

తెలంగాణను ముంచింది కాంగ్రెస్, నెహ్రూ: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మరిచిపోయిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. కాంగ్రెసోళ్లు ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ముంచింది కాంగ్రెస్, మాజీ ప్రధాని నెహ్రూను ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గంటలే సాగుకు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పడం లేదని సిఎం కెసిఆర్ చురకలంటించారు. తెలంగాణ అంటే బిజెపి ఎందుకు పగో అర్థం కావడంలేదని, బిజెపి వైఖరేంటో ఎవరికి అర్థం కాదని, చట్టాన్ని కూడా గౌరవించే సంస్కారం మోడీ ప్రభుత్వానికి లేదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. కేంద్రానికి చేతనైతే ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. వందేభారత్ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ 100 సార్లు జెండా ఊపారని ఎద్దేవా చేశారు. రైల్వే స్టేషన్‌లో లిప్టులను జాతికే అంకితం చేయటం ఏంటని చురకలంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News