Wednesday, January 22, 2025

ఉన్న తెలంగాణను పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: రైతుబంధు పథకానికి ఆద్యుడు కెసిఆర్ అని.. రైతుబంధును దశలవారీగా రూ. 16 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీ గురువారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కెసిసిఆర్ హాజరయ్యారు. అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని కెసిఆర్ తెలిపారు. పాలమూరు- ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారు. ప్రాజెక్టులు పూర్తయితే కెసిఆర్ కు పేరు వస్తుందని కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరు గెలిస్తే.. తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలని సిఎం ప్రజలకు సూచించారు. ఉన్న తెలంగాణను పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని కెసిఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇస్తామని 2004 లో ప్రకటించింది 2014లో ఇచ్చారని ఆయన వెల్లడించారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News