Sunday, December 22, 2024

మత పిచ్చిగాళ్ల అంతు చూడాలి

- Advertisement -
- Advertisement -

CM KCR fires on BJP in Wanaparthy

10గంటలకు శుభవార్త

నిరుద్యోగులూ టివిల ముందుండండి

అసెంబ్లీ నుంచి ప్రకటన చేస్తా

వనపర్తి సభలో సిఎం కెసిఆర్

కాషాయజెండాను
బంగాళాఖాతంలోకి
విసిరివేయాలి

దేశం కోసం ప్రాణం ఇస్తా

దేశ రాజకీయాలను చైతన్యం చేస్తా బంగారు భారతదేశాన్ని నిర్మిద్దాం ఎస్‌టిల రిజర్వేషన్ 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం తొక్కిపట్టింది వాల్మీకి బోయలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని మొరపెట్టుకుంటే పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది తెలంగాణ ఒకప్పుడు కరువుతో అల్లాడింది, ఇప్పుడు పంటపొలాలతో కళకళలాడుతోంది, 11 రాష్ట్రాల నుంచి ప్రజలు తెలంగాణకు వలస వస్తున్నారు కేంద్రంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలున్నా భర్తీ చేయడం లేదు రాష్ట్రంలో నిరుద్యోగులకు నేను అండగా ఉంటా ప్రాణత్యాగం చేసైనా దేశాన్ని కాపాడుకుంటాను ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి : వనపర్తి బహిరంగసభలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : దేశ ప్రజలను మతం, కులం పేరుతో ఆగం పట్టించే ప్రయత్నాలు చేస్తున్న కాషాయ జెండాను, భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. “కాషాయ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలి, మత, కులపిచ్చిగాళ్లను కూకటివేళ్లతో పెకిలించాలి, దేశ రాజకీయాలను చైతన్యం చేస్తా , బంగారు భారతదేశాన్ని నిర్మిద్దాం” అని ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో గోల్‌మాల్ గోవిందంగాళ్లు ఎక్కువయ్యారని, మతాలపేరుతో దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణాత్యాగం చేసైనా దేశాన్ని కాపాడుకుంటానన్నారు. చైతన్యం ఉన్న గడ్డగా కంఠంలో ప్రాణమున్నంతవరకు ఇలాంటి అరచకాలు చేయనియ్యనన్నారు. ప్రజలందరూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు.

తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాడానో అదేవిధంగా దేశంలో సామరస్యాన్ని, శాంతి, మంచిని పెంచడానికి అవసరమైతే ప్రాణాలైన ధారబోయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. బుద్ధి తక్కువ పార్టీలు చిల్లర రాజకీయాల కోసం భారత జాతిని బలిపెట్టే విష ప్రయత్నాలు చేస్తున్నారని, మేధావులు దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వానికి ప్రజల డిమాండ్లు, ఆకాంక్షలు తెలియవని విమర్శించారు. గిరిజనులు రిజర్వేషన్ 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానంచేసి పంపిస్తే కేంద్రం తొక్కిపట్టిందని విమర్శించారు. అదేవిధంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే పరిష్కరించకుండా మూర్ఖంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రజలకు మతపిచ్చి లేపి పబ్బం గడుపుకుంటున్న మతపిచ్చిగాళ్లను కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. దేశ రాజకీయాలను కూడా చైతన్యపరుస్తానని, ఎవరెన్ని కష్టాలుపెట్టిన మడమతిప్పకుండా ముందుకు సాగి బంగారు తెలంగాణలాగే బంగారు భారతదేశాన్ని నిర్మిస్తానన్నారు.తెలంగాణ నేడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని.. ఒకప్పుడు కరువుతో అల్లాడిన తెలంగాణ జిల్లాలు నేడు పంట పొలాలతో కళకల్లాడుతున్నాయన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా దళితబిడ్డల కోసం దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తూ రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు.

11 రాష్ట్రాల నుంచి ప్రజలు తెలంగాణకు వలసలు వస్తున్నారంటే అభివృద్ధి ఏవిధంగా ఉందనేది అర్థం చేసుకోవాలన్నారు. నాడు విద్యుత్ వస్తే వార్త నేడు విద్యుత్ పోతే వార్త అని, ప్రజలకోసం తపన పడే ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఏడేండ్లు అవినీతి రహితంగా పాలన కొనసాగించినందుకు ఫలితాలు వచ్చాయన్నారు.

నిరుద్యోగులకు నేడు శుభవార్త

బుధవారం అసెంబ్లీలో నిరుద్యోగులకు తీపికబురు అందిస్తానని సిఎం ప్రకటించారు. ఉపాధ్యాయులకు త్వరలో పదోన్నతులు కల్పించాలని కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ రాష్ట్ర, దేశ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కరువుతో ఉన్న జిల్లాను సస్యశ్యామలం చేశారని అన్నారు. ఒకప్పుడు వయ్యారిభామలు, లొట్టపీస్ చెట్లకు నిలయంగా ఉన్న భూములు పచ్చని పంటలు పండుతున్నాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆత్మవిశ్వాసం పెరిగాయన్నారు. కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్ కాలేజి, ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేశారన్నారు. కెసిఆర్ ఆశీర్వాదంతో దేశంలోనే అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలిపేందుకు కృషి చేస్తానన్నారు.

నిరుద్యోగులూ 10 గంటలకు టివిల ముందుండండి
ఎన్నో అడగకుండానే చేశా.. ఇంకా చేస్తునే ఉం టా.. నిరుద్యోగులకు బుధవారం శుభవార్త చెప్పబోతున్నా.. అంతా ఉదయం 10 గంటలకు టివీ లు చూడండి.. అసెంబ్లీలో నుంచి ప్రకటన చేయబోతున్నా అంటూ మంగళవారం సాయం త్రం వనపర్తిలో జరిగిన బహిరంగంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నా భర్తీ చేయడం లేదంటూ, రాష్ట్రంలో నిరుద్యోగులకు తాను అం డగా ఉంటానని సభా వేదిక నుంచి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News