Monday, December 23, 2024

మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోడీకే మీటర్ పెట్టాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

పెద్దపల్లి: మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోడీకే మీటర్ పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. పెద్దపల్లిలోని ప్రతి గామ పంచాయతీకి నిధులు ఇస్తామని, గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. రామగుండం కార్పొరేషన్‌కు కోటి రూపాయలు మంజూరు చేశామని, మూడు మున్సిపాలిటీలకు కోటి రూపాయల చొప్పున నిధులు ఇస్తామని, ఎపిఎల పేరుతో రూ.12 లక్షల కోట్లు దోచి పెట్టారని బిజెపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేట్ దొంగలకు దోచినంత సొమ్ము కాదని, ప్రజల రక్తమన్నారు.   గోల్‌మాల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలేనని, దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్ 20.8 శాతమేనని స్పష్టం చేశారు. దేశంలో సాగుకు వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని తెలియజేశారు. బిజెపిని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతుందని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరారని, మీటర్లు లేని విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరారని కెసిఆర్ పేర్కొన్నారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలన్నారు. బిజెపి ముక్త భారత్ కోసం అందరూ సన్నధం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News